19-09-2025 12:00:00 AM
నిర్మల్, సెప్టెంబర్ ౧8 (విజయక్రాంతి): నిర్మ ల్ కాంగ్రెస్‌లో ముసలం ముదిరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నిర్మల్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్లో వర్గ పోరు తారాస్థాయికి చేరుకోవడంతో పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు రెండు కూటమిగా ఏర్పడ్డా రు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు పార్టీ అధినేతలను ప్రసన్నం చేసుకుంటున్న అక్కడ ప్రతిఫలం దక్కకపోవడంతో ముఖ్య నేతలందరూ కూడా నిరాశ నిస్త్రులకు గురవుతున్నారు.
అధికార పార్టీలో ఉన్న మన భావన ఒక వర్గం అయితే రాజకీయ అనుభవం ఉండి అధికార పార్టీలో ఉండే చెల్లుమట్టు అవుతుందని భావించిన నేతలకు పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో పార్టీలో రోజురోజుకు వివాదం ఏర్పడుతుంది. నిర్మల్ జిల్లాలో నిర్మ ల్ ఖానాపూర్ ముధోల్ నియోజకవర్గాలు ఉం డగా ఖానాపూర్‌లో అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు పటేల్ ప్రాతిని థ్యం వేస్తుండగా నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షులు కే శ్రీ ఆర్ రావు, ముధోల్లో మాజీ నారాయణరావు పటేల్ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసా గుతున్న సంగతి తెలిసింది.
2023 డిసెంబర్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం అధికారులకు వచ్చి 22 నెల్లు గడుస్తున్న నిర్మల్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగు పడకపోగా మరింత దిగజారుడు తనానికి దారితీ స్తుందని పార్టీ ముఖ్య నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడుతూ పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న కాం గ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీ కార్యక్రమాలను చేసిన ముఖ్య నాయకులు కార్యకర్తలు జిల్లాలో కొనసాగుతున్న వర్గపూరితో సతమతమవుతున్నారు.
పార్టీలో వర్గ విభేదాలు పక్కన పెట్టి అందరూ ఐక్యతతో పార్టీ కోసం కష్టపడి పని చేయాలని పార్టీ అధిష్టానం సూచించిన నిర్మ ల్‌లో మాత్రం మూడు నియోజకవర్గాల్లో రెండు వర్గాల వర్గ పోరు ఆధిపత్యం చాటుకునేందుకు ఎవరికి వారే యము నా తీరే అనే చందాగా తయారైందని పేర్కొంటున్నారు. మూడు నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నేతలు అంతా కూడా రెండు గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారే అమలు చేస్తున్న పార్టీ అధిష్టానం దీనిపై దృష్టి పెట్టకపోవడం పార్టీకి తీర నష్టం కలిగిస్తుందని సీరియల్ నేతలు ఆపుతున్నారు
తాజా మాజీలకు దక్కని గౌరవం..
2014 నుండి 2023 వరకు పది సంవత్సరాల పాటు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారుల్లో ఉంది. 2014 ఎన్నికల్లో నిర్మల్‌లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముధోల్‌లో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, ఖానాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్ పదేళ్లపాటు పదవులు పొందిన సంగతి తెలిసింది. 2023లో జరిగిన ఎన్నికల్లో నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ నుంచి రామారావు పటేల్ బిజె పి ఎమ్మెల్యేలుగా గెలుపొందగా ఖానాపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు పటేల్ విజయం సాధించారు.
ఎన్నికలకు ముందే ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖాశ్యామ్ నా యక్ కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎన్నికల తర్వాత మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు ఎన్నికల్లో పోటీ ఓడిపోయిన శ్రీహరి రావు నిర్మల్‌కు ముధోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు.
ఈ మూడు నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ నాయకులు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్త నాయకులు వర్గాలుగా విడిపోయి తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పనితీరుపై ఓ వర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్ దృష్టికి తీసుకువచ్చారు.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఐక్యత ఇచ్చేందుకు సీతక్క ప్రయత్నించినప్పటికీ అవి బెడిసి కొట్టా యి. దీంతో పార్టీ కార్యక్రమాల అమలుపై ప్రతిష్ట మన కొనసాగించిన కారణంగా పార్టీ దిద్దుబాటు చర్యలు బాగా ఇం చార్జ్ మంత్రిని సీతక్క నుంచి తప్పించి సీనియర్ కాంగ్రెస్ నేత మంత్రి జూపల్లి కృష్ణారావుకు బాధ్యతలు అప్పగించారు.
అయితే జూపల్లితో పాత సీనియర్ నేతలకు మంచి సంబంధాలు ఉండ డంతో పాత నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తాము నియోజకవర్గ ఇన్చార్జిలమైన తమను పట్టించుకోవడంలేదని డిసిసి అధ్యక్షులు సిఆర్ రావు ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అదృష్టాన్ని దృష్టికి తెచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఖానాపూర్‌లో కూడా సెట్టింగ్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు పటేల్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్ కూడా అసంతృప్తి ఉన్నట్టు ముఖ్య నేతలు తెలిపారు.
అయితే మూడు నియోజకవర్గాల్లో రెండు గ్రూపులుగా ముఖ్య నాయకు లు విడిపోవడంతో పార్టీని నమ్ముకున్న కష్టప డి పని చేస్తున్న కర్తలను ఎవరూ పట్టించుకోకపోవడంతో వారంతా నిరాశ నిష్రులతో అం తర్మాతనం చేసుకుంటున్నారు
మారిన రాజకీయ పరిస్థితులు
ఎన్నికల ముందు వరకు నియోజకవర్గ ఇన్చార్జిలు పార్టీ కోసం కష్టపడి పని చేస్తూ కార్యకర్తలు అందరిని సంఘటితం చేసిన ఎన్నికల తర్వాత ఓడిపోయిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీ సమీకరణాలు తీవ్రంగా మారిపోయాయి. సుదీ ర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముధో ల్ తాజా మాజీ ఎమ్మె ల్యే విట్టల్ రెడ్డి ఖానాపూ ర్ తాజా మాజీ ఎమ్మె ల్యే రేఖా శ్యాం నాయక్ అధికార పార్టీలోకి మారి న వారి మాటలకు రాజకీయ ప్రాబల్యానికి తగిన స్థాయిలో గుర్తిం పు లేదని నిరాశ చెంది అంతర్మాతనం చేసుకుంటున్నట్టు చెప్తున్నారు.
నిర్మల్‌లో ఏ ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం కూడా గుప్పుమంటుంది. అయితే ఇంద్రకరణ్ రెడ్డి విట్టల్ రెడ్డి రేఖ శ్యామ్ నాయకులకు ఆయా నియోజకవర్గాల్లో ఒక ప్రత్యేక క్యాడర్ లీడర్ ఉం డడంతో అధిష్టానం కూడా ఆచితూచి అడుగుస్తుంది. మొన్నటి వరకు సిఆర్ రావు నారాయణరావు పటేల్ రేఖ శ్యాం నాయక్ వెంట కలిసి పనిచేసిన ముఖ్య నేతలందరూ కూడా ఇప్పుడు వారి వద్ద నుంచి ఒక్కొక్కరు దూరం అవుతుండగా ఐక్య రెడ్డి దగ్గర పనిచేసిన వర్గీయులు కూడా కొందరు వైరీవర్గంలో చేరి తమ రాజకీయానికి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
నిర్మల్ యోగంలో శ్రీహ ర్రావు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇన్చార్జి మంత్రి పర్యటనలో ఇంద్రకన్ రెడ్డికి ప్రాధన్యతిస్తుందని సిఆర్‌రావు ఆరోపిస్తుండగా రాజకీ య అనుభవంతో జిల్లా అభివృద్ధి కోసమేనని పార్టీ అధిష్టానం శ్రీ ఆర్ రావుకు చెప్పినట్టు తెలిసింది. ఈ మూడు నియోజకవర్గాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు నేపథ్యంలో మం త్రులు పర్యటించగా రెండు వర్గాల వారు వేరువేరుగా మంత్రి వెంట ఉన్నారు. అయితే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కొందరు ముఖ్య నాయకులు నేతల తీరు నచ్చక మరో వర్గం లో చేరిపోవడం అక్కడ ఉన్నవారు అసంతృప్తితో ఈ వర్గంలో చేరడం జిల్లా వ్యాప్తంగా జం పు జలారీల కాంగ్రెస్‌గా మారిందని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ప్రజా పాలన ప్రభుత్వం ప్రజల కోసం రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన పథకాలు అమలు చేస్తున్న దాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేయవలసిన కాంగ్రెస్ పార్టీ నేతలు వర్గ పోరు కారణంగా గ్రామాల్లో ప్రచారం చేసుకోలేని దుస్థితి ఏర్పడింది. దీనికి తోడు జిల్లాలో ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు ఉండడంతో వీరికి సరైన ప్రాధాన్యత అధికారుల నుంచి దక్కక పోవడం కూడా అసంతృప్తికి గురిచేస్తుంది.
ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల దృష్టి లో పెట్టుకొని పార్టీ కోసం కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు ముఖ్య నాయకులకు సూచి స్తున్న పార్టీలో మాత్రం తమకు ప్రార్థన లేదన్న భావనతో కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ముఖ్య నాయకుల పై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీహ రి రావు నారాయణరావు రేఖా శ్యామల వద్ద పనిచేసిన ముఖ్య నాయకులకు పార్టీ పదవుల్లో తగిన ప్రాధాన్యత లేదని వారు అసంత వ్యక్తం చేస్తుండగా పార్టీ క్షేమం కోసం తాము పార్టీ మారిన తమ వర్గీయులను
నామినేటెడ్ పోస్టుల భర్తీలో అసలు పరిగణలోకి తీసుకోవడం లేదని పార్టీలో చేరిన తాజా మాజీలు పార్టీ దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది దీంతో రెండు వర్గాల మధ్య ఏర్పడుతున్న వివాదం సమసి పూక పోగా అది మరింత జట్టులం కావడంతో పార్టీ అధిష్టానం ఈ జిల్లాపై అంత గా పట్టించుకోవడం లేదని విమర్శలు వినవస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కొనసా గుతున్న ముఖ్య నేతలందరూ కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసిన అనుభవం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించకపోవడానికి పార్టీలో అంతర్గత కలహాలు లేని పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలు గట్టిగానే చెబుతున్నారు.
ముఖ్యమైన కార్యకర్తల పనులు కూడా వారు చేయకపోవడంపై కొందరు అసంతృత్తో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒకరిపై చర్య తీసుకుంటే మరొకరు దూరమయ్యే అవకాశం ఉండడంతో పార్టీ సమయం కోసం వేచి చూస్తోంది. అసంతృప్తినిస్తున్నారు. ఇంచార్జ్ మంత్రిగా నియమితు లైన జూపల్లి కృష్ణారావు నిర్మల్ జిల్లాలో పార్టీస్థితిగతులపై ఎప్పటికప్పుడు దృష్టి సారించి వర్గ పోరు సమస్య పోయేలా చర్యలు చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు కోరుతున్నారు.