19-09-2025 12:24:06 AM
* ఐదేళ్ళ సర్వీసు ఉన్నవాళ్ళను పర్మినెంట్ చేయాలి
మెదక్, సెప్టెంబర్ 18 :తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వైజ్, కాoటినిజెంట్ వర్కర్ల జేఏసి ఆ ధ్వర్యంలో వర్కర్లు గురువారం మెదక్ లోని హాస్టల్ వద్ద మోకాళ్ళపై నిల్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా డైలీ వేజెస్ వర్కర్స్ జిల్లా అధ్యక్షుడు దొడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ 212 జీవో ను సవరించి 2014 నాటికి ఐదెండ్లు సర్వీస్ ఉన్న వారందరిని పర్మనెంట్ చేయాలని డి మాండ్ చేశారు.
జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు ట్రెజరీ లకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త మెనూ పెరిగిన పనిభారానికి అనుగుణంగా కార్మికులను పెంచలన్నారు. పూర్తికాలం పనిచేస్తున్న కార్మికులకు పూర్తి వే తనాలు ఇవ్వాలన్నారు. విద్యార్థులతో పాటు కార్మికులకు కూడా రెండు జతల యూనిఫాం, ఐడి కార్డులు ఇవ్వాలన్నారు.
కార్మికులకు రూ 10 లక్షల ప్రమాద భీమా కల్పించాలని కోరారు.ఏండ్ల తరబడి అనేక సమస్యలతో సతమతమవుతున్నామని, వేంటనే సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం యూనియన్ ప్రధాన కార్యదర్శి జె. సునంద కోశాధికారి ఏ. మాధవి సలహాదారు నూనె శేఖర్ ఉపాధ్యక్షులు డి. సువర్ణ సభ్యులు భూలక్ష్మి,జ్యోతి, పెంటమ్మ,రజిత,కిషన్,సురేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.