calender_icon.png 8 August, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత కార్మికులకు బీజేపీ మరింత అండ

08-08-2025 12:00:00 AM

బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి

నల్గొండ టౌన్, ఆగస్టు 7: ప్రతి చేనేత కార్మికులను బిజెపి ప్రభుత్వం మరింత ముందుకు తీసుకుపోతుందని బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి  చెప్పారు. జాతీయ చేనేత  దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన  కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గాంధీ జీ సైతం రాట్నంపై నూలు వడికేందుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారని, అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి ప్రత్యేకంగా ఒకరోజు ఉండాలన్న  ఉద్దేశంతో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ   జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పా టు చేశారన్నారు.

2017 ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటి చేనేత దినోత్సవాన్ని ప్రా రంభించారని, ఈ సందర్భంగా జాతీయ భారత చేనేత లోగోను ఆవిష్కరించి, ఆగస్టు ఏడో తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి నిర్వహి స్తున్నట్లు చెప్పారు.  అర్హులైన ప్రతి చేనేత కళాకారులకి చుట్టు పండు పథకం కింద అందరికీ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

గుంట మగ్గం చీరలు తయారు చేసే వారందరూ ఎంతో ఇబ్బంది గురవుతున్నారని వారికి వెంటనే స్టాండ్ మొగ్గలు ఇప్పించాలని అన్నారు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంతోమంది చేనేత కళాకారులు చాలా ఇబ్బందులకు గురవుతు న్నారని గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాలు చేనేత కార్మికులను ఏ రోజు పట్టించుకోలేదని చెప్పారు.  చేనేత రంగాన్ని మరింతగా ప్రోత్సహించి ముందుకు తీసుకుపోతామని చెప్పారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెల్లి  చంద్రశేఖర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు కోమటి వీరేశం, జిల్లా జనరల్ సెక్రెటరీ పోతేపాక లింగస్వామి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, నల్లగొండ పట్టణ టూ టౌన్ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, నల్లగొండ జిల్లా ఓబీసీ మోర్చా జనరల్ సెక్రెటరీ తీరందాస్ కనకయ్య, జిల్లా నాయకులు రాపోలు విద్యాసాగర్  పట్టణ టు టౌన్ జనరల్ సెక్రెటరీ కటకం శ్రీధర్, రాపోలు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.