calender_icon.png 8 August, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత వస్త్రాన్ని ధరిద్దాం.. నేతన్నకు అండగా ఉందాం

08-08-2025 12:00:00 AM

మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్

నకిరేకల్, ఆగస్టు 7: ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు అండగా ఉండాలని నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం నకిరేకల్ పట్టణంలోని చేనేత సహకార సంఘం భవనంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజి చిత్ర పటానికి పూలమాలు వేసి ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత వస్త్రాలు మంచి ఆరోగ్యాన్ని అందాన్ని ఇస్తాయన్నారు.

చేనేత వృత్తి చాలా పవిత్రమైందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నేతన్నలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని ఆమె కోరారు. నేతలకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఆమె తెలిపారు. అనంతరం సన్మానిం చారు. చనిపోయిన నేత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ సూర్యపేట చేనేత సహకార సంఘాల అధ్యక్షుడు చిలుకూరి లక్ష్మి నరసయ్య,  పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ పన్నాలరాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ లింగాల వెంకన్న, చేనేత సహకార సంఘాల నాయకులు రావిరాల మల్లయ్య, మురుడుడ్ల కృష్ణమూర్తి, దుస్య సత్యనారాయణ, పెండాం సదానందం, జనార్ధన్ తదితర నాయకులు పాల్గొన్నారు.