24-12-2025 12:23:40 AM
వనపర్తి, డిసెంబర్ 23 (విజయక్రాంతి) : సమాజంలో అట్టడుగు వర్గాల వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందాలని, బలమైన సమాజాన్ని నిర్మించినప్పుడే బలమైన దేశం తయారవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రధానమంత్రి కలలు కంటున్న వి కసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ విద్య, వైద్యం, ఆర్థికంగా సాధికారత సాధించాలన్నారు.
మంగళవారం వనపర్తి జిల్లా సమీకృతకార్యాలయాల సముదాయం సమావేశ మందిరం లో నిర్వహించిన జిల్లా అధికారులు, వివిధ రంగాల ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య సాదర స్వాగతం పలికారు.
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అక్కడే ఏర్పాటు చేసిన స్టాల్స్, విద్యార్థుల యొక్క సాంస్కృతిక నృత్య ప్రదర్శనలను తిలకించారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, గవర్నర్‌స్పెషల్ సెక్రటరీ భవాని శంకర్, ఎస్.పి.డి. సునీత కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో క్షయ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
జిల్లాలో ప్ర తి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ ఉండాలనే లక్ష్యం తో జిల్లా యంత్రాంగం హెల్త్ యాప్ ని సృష్టించడం చాలా అద్భుతమని గవర్నర్ కొనియాడారు. వనపర్తి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు జిల్లా కలెక్టర్ శ్రీరంగాపురం చిత్రపటం, మెమెం టోతో సత్కరించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో గవర్నర్ మొక్కను నాటారు. అ నంతరం గవర్నర్‌తో జిల్లా అధికారులు, ప్ర ముఖులు ఫొటో దిగారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కవులు, కళాకారులు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి ః గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
గద్వాల, డిసెంబర్ 23 : జోగులాంబ గద్వా ల జిల్లా కవులు, కళాకారులు జిల్లా అభివృద్ధి లో భాగస్వాములు కా వాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.మంగళవారం ఐడీఓసీ సమావేశ హాల్ నందు జిల్లా అధికారులు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన క్షేత్రమని పేర్కొన్నారు.
ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాజ్ భవన్ను ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ‘లోక్ భవన్’గా పేరు మార్చినట్లు గవర్నర్ తెలిపారు. విద్య అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొంటూ, విద్యా రంగంలో గుణాత్మక అభివృద్ధి సాధించి, జిల్లాలో ఉత్తమ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని గవర్నర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, గవర్నర్కు సంయుక్త కార్యదర్శి జె.భవానీ శంకర్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అలంపూర్ శాసన సభ్యులు విజయుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి, గవర్నర్కు ఏడీసీ మేజర్ అమన్ కుందూ, ఏడీసీ కాంతిలాల్ పటేల్, సీఎస్‌ఓ ఎల్.శ్రీనివాస రావు, గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి పవన్ సింగ్, అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ రావు, ఆర్డీవో అలివేలు, జిల్లా అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు