21-07-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 20 (విజయక్రాంతి): గోషామహల్ నియోజకవర్గంలో ఆదివా రం నిర్వహించిన బోనాల వేడుకల్లో బీజేపీ నేత కొంపెల్లి మాధవిలత పాల్గొని, అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఆళ్ల పురుషోత్తమ రావు ఆహ్వానంపై కొంపెల్లి మాధవిలత హాజరయ్యారు.
అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్న ఆమె, భక్తులతో కలిసి వేడుకల్లో భాగమయ్యారు. పుష్పాలతో, దీపాలతో అలంకరించబడిన ఆలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ.. “తెలంగాణ తల్లి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలి” అని కాంక్షించారు.