05-12-2024 11:19:04 PM
పోటోరైటప్: 05కెఎంఆర్09: కామారెడ్డిలో ర్యాలీ నిర్వహిస్తున్న బిజేపీ నాయకులు
05కెఎంఆర్10ః బాన్సువాడలో ర్యాలీ నిర్వహిస్తున్న బిజేపీ నాయకులు
ఒక్కో లబ్దిదారుడికి సైతం సొంత ఇంటి కళ నెరవ్చేని కాంగ్రెస్
ఏడాది పాలన పూర్తిగా విఫలం
రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టేసింది
ప్రతిపక్షాలను తిట్టడం తప్ప ఏడాది కాలంగా రేవంత్‌రెడ్డి చేసిందేమి
రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై కామారెడ్డిలో బైక్ ర్యాలీ
కామారెడ్డి,(విజయక్రాంతి): కొత్త పెన్షన్, ఒక్క రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వ సంబరాలు ఎందుకుని, ఏడాది పాలన పూర్తిగా విఫలమైందని,ప్రతిపక్షాలను తిట్టడం తప్ప ఏడాది కాలంగా రేవంత్‌రెడ్డి చేసిందేమిని బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు కామారెడ్డి నియోజకవర్గంతో పాటు బిజేపి కార్యకర్తలు ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, బిచ్కుంద జిల్లా కేంద్రంలోని పురవిధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అవుతున్న 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 66 వాగ్దానాలు, ఐదు సంవత్సరాల్లో మెనిపెస్టోలో ఉన్న అన్ని నెరవేర్చమని ప్రజలను మభ్యపెట్టి ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒక్క గ్యారెంటిన్ కూడా పూర్తిస్థాయిలో అమలు చేయక ప్రజలను మోసం చేసిందని ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ, రాహూల్‌గాంధీ ప్రియాంకగాంధీ, మల్లికార్జున కార్గే పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్ సహా నేతలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నీటి మీద రాతలే అయ్యాయన్నారు.
రాతపూర్వకంగా ఇచ్చిన హమీలు బూటకంగానే మిగిలిపోయామన్నారు. నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పి ప్రజాస్వామిక పాలన అందజేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి పాయింట్‌కు దిక్కు లేకుండా పోయిందన్నారు. మహిళకు 2500 ఆర్థిక సాయం చదువుకునే ప్రతి అమ్మాయికి స్కూటి బండి, ప్రతి ఆడబిడ్డ పెండ్లికి లక్ష ఆర్థికసహయం,తులం బంగారం హమీలకు దిక్కుల ఏలకుండా పోయిందన్నారు. రైతు భరోసా కింద రైతులకు,కౌలురైతులకు ఎకరానికి రూ.15 వేలు,వ్యవసాయం కూలీలకు రూ.12 వేలు అందిస్తామని ఏడాది అవుతున్న కూలీలకు ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, నరేందర్, మోటూరి శ్రీకాంత్, ఆకుల భారత్‌కుమార్,గుడుగుట్ల శ్రీనివాస్, శంకర్‌గౌడ్, హన్మండ్లు, సాయికిరణ్, గంగారెడ్డి, మోహన్‌రెడ్డి, శివశంకర్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.