calender_icon.png 8 August, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తాం

08-08-2025 12:36:49 AM

టీజీఈ జేఏసీ చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి 

కామారెడ్డి అర్బన్, ఆగస్టు 7 (విజయ క్రాంతి) ః ఉద్యోగుల హక్కుల సాధన కోసం రాష్ర్ట టీజీ ఈ జెఎసి పిలుపుమేరకు ఉద్యమిస్తామని టి జి ఈ జేఏసీ కామారెడ్డి జిల్లా చైర్మన్ నరాల వెంకటరెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం గత 18 నెలలుగా ఎదురుచూస్తూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు.

అనేక పర్యాయాలు  మంత్రుల కమిటీ సభ్యులతో , %జుఐ% ల కమిటికి గౌరవ రాష్ర్ట ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ , సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో  ముఖ్యమంత్రి తో, మంత్రివర్గ ఉప సంఘంతో, అధికారుల కమిటీతో చర్చలు జరిపినప్పటికీ ఏ ఒక్క సమస్య ఇప్పటివరకు పరిష్కారానికి నోచుకోలేదు అన్నారు.

ముఖ్య మంత్రి, మంత్రులు స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉండడం శోచనీయమని కామారెడ్డి జిల్లా చైర్మన్ నరాల వెంకట్ రెడ్డి అన్నారు. కామారెడ్డి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం  భవన్  లో ఏర్పాటు చేసిన టిజిఇజేఏసీ ప్రత్యక్ష సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన  సమావేశంలో తెలిపారు.  ఈ సమావేశంలో ఎంప్లాయిస్ %ఊజూఅజు్పు% జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి %ఈజీ% దేవేందర్, అడిషనల్ జనరల్ సెక్రటరీ అల్లాపుర్ కుశాల్, నిట్టు విట్టల్ రావు, నీలం లింగం పాల్గొన్నారు.