calender_icon.png 8 August, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్ఫ్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి

08-08-2025 12:41:35 AM

ఎమ్మెల్యేను కోరిన గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు 

కామారెడ్డి, ఆగస్టు 7 (విజయక్రాంతి) ః గల్ఫ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండ సురేందర్ రెడ్డి కోరారు. గురువారం కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కలిసి గల్ఫ్ కార్మికుల సమస్యలను వివరించారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా గల్ఫ్ కి వెళ్తున్నారని అక్కడ వారు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. చనిపోయిన గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం అందేలా చూడాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. గల్ఫ్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.