calender_icon.png 8 August, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిని కలిసిన సుడా చైర్మన్

08-08-2025 12:39:19 AM

కరీంనగర్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడును ఢిల్లీలోని రాజ్ భవన్ మంత్రిత్వ కార్యాలయంలో గురువారం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని నరేందర్ రెడ్డి ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్ సమీపంలో విమానాశ్రయం ఏర్పాటుకు సర్వే జరిపి నిధులు మంజూరు చేయాలని కోరారు.

గతంలో సర్వే చేయడం జరిగిందని ఆది కార్యరూపం దాల్చలేదని, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది దేశ విదేశాలలో నివసిస్తున్నారని అంతే కాకుండా గ్రానైట్ పరిశ్రమ విస్తరించి ఉండడం వల్ల వ్యాపార కార్యకలపాలకు అనుకూలంగా ఉంటుందని  నరేందర్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరినట్టు తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో ఒక అధికార బృందాన్ని పంపిస్తామని విమానాశ్రయానికి అనుకూలమైన ప్రదేశాలను చూపించాల్సిందిగా నరేందర్ రెడ్డి కి సూచించినట్టు పేర్కొన్నారు.  నరేందర్ రెడ్డి తో పాటు కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి కూడా ఉన్నారు.