17-01-2026 02:03:45 AM
తూప్రాన్, జనవరి 16 :తూ ప్రాన్ మండలం ఇస్లాంపూర్ పరిధిలోని రామప్పగుట్టపై శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని శుక్రవారం సిద్దిపేట జిల్లా భాజ పా పార్టీ అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ కాళ్ళకల్ మాజీ సర్పంచ్ భాజపా సీనియర్ నా యకులు నత్తి మల్లేశ్ ముదిరాజ్ స్వామివారిని దర్శించుకున్నారు. వారు మొక్కుబడులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం శ్రీ రామలింగేశ్వరుని ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ రూరల్ అధ్యక్షులు పిట్ల పోచయ్య ముదిరాజ్, మనోహరాబాద్ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, బీజేపీ జిల్లా నాయకులు వెంకటేష్ తూప్రాన్ మండల ప్రధాన కార్యదర్శి అంబటి మహేష్ యాదవ్, శక్తి కేంద్రం ఇంచార్జి కుంట రాజు, ఎల్లేష్ యాదవ్ తూప్రాన్ మనోహరాబాద్ మండలాల భాజపా నాయకులు పాల్గొన్నారు.