04-12-2025 12:54:48 AM
అలంపూర్, డిసెంబర్ 03: అలంపూర్ పరిధిలోని ఇటిక్యాల మండలానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.ఈ మేరకు బుధవారం ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ను కలిసి ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేరిన వారిలో ఇటిక్యాల మండల బిజెపి మాజీ అధ్యక్షులు నరేంద్ర , పలువురు బిజెపి కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, సాతర్ల మాజీ సర్పంచ్ జయ చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.