08-08-2025 12:00:00 AM
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండ టౌన్, ఆగస్టు 7 : పేదలకు వరం లాంటిది సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 47 మంది కి రూ 21,4,000 విలువ గల చెక్కులను గురువారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బాధితులకు అందజేసి మాట్లాడారు.
ముఖ్యమంత్రి సహాయనిధీ పథకం వలన నిరుపేదలకు ఎంతో లబ్ది చేకూరుతుందన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందిందన్నారు. నిరుపేద ప్రజలకు సహాయాన్ని అందించడం హర్షదాయకమని ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.