08-08-2025 12:00:00 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
యాదగిరిగుట్ట ఆగస్టు 7 (విజయ క్రాంతి): ఆగస్టు 7 చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ ఎన్ రాంచంద్ర రావు, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు అనంతరం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసినటువంటి 11వ జాతీయ చేనేత కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో వాగ్దానంలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ లో వ్యాప్తంగా మూడు క్లస్టర్ మంజూరు చేసి చేనేత కళాకారులకు చెందిన పని కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ హామీ ఇప్పటివరకు కూడా మొదలుపెట్టలేదు.
కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వీవర్ సర్వీస్ సెంటర్ ద్వారా అనేకమైనటువంటి సంక్షేమ పథకాల అమలు పరుస్తూ 90% సబ్సిడీతో వారికి స్టాండ్ మొగ్గాలు జాకత్ లూమ్ వర్క్ అనేక మైనటువంటి సంక్షేమ పథకాలు అమలు పరుస్తా ఉన్నది రాబోయే కాలంలో ఎన్నికలు ఇచ్చిన నెరవేర్చడం రామచంద్ర రావు ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ అధ్యక్షతనలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చేనేత కళా కారులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
పట్టణం నుండి భువనగిరి వరకు భారీ రైతు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు , మెదక్ జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాదాల శ్రీనివాస్ ,దాసరి మల్లేశం, వట్టిపల్లి శ్రీనివాస్ ,బిజెపి జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.