01-07-2025 07:39:29 PM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..
మానకొండూర్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నామని, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా ఈ సేవల పట్ల విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) అన్నారు. మంగళవారం మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, లేబర్ రూమ్, మెడికల్ స్టోర్ పరిశీలించారు. వివిధ రిజిస్టర్లు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 100 శాతం మహిళలకు వైద్య పరీక్షలు చేయాలని అన్నారు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ భవిత కేంద్రాన్ని, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను, నర్సరీని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, మండల విద్యాధికారి మధు సూదన్, భవిత కేంద్రం ఇన్స్ట్రక్టర్లు ఉమ, రాంప్రసాద్, కార్యదర్శి రేవంత్, తదితరులు పాల్గొన్నారు.