01-07-2025 07:42:24 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తిలోని డా. భాస్కర్ మడేకర్ కంటి ఆసుపత్రి(Dr. Bhaskar Madhekar Charitable Eye Hospital)లో మంగళవారం డాక్టర్స్ డే, చార్టర్ అకౌంటెంట్స్ డే, పోస్టల్ వర్కర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్స్ పేషంట్స్ హితం కోరి సేవాభావంతో పనిచేయాలని రేకుర్తి కంటి ఆసుపత్రి మరిన్ని స్పెషాలిట్ విభాగాలను ప్రారంభించాలని సూచించారు. అనంతరం రేకుర్తి ఆసుపత్రి డాక్టర్స్ దేశముక్, శ్వేత, స్వాతి, హారిక, స్వాతి శ్రీ, ల శిఫ్ఫాలి, సౌమ్య, ఆనంద్ కుమార్, అనిల్ కుమార్, ముక్క సుష్మ, పోస్టల్ వర్కర్స్ వరలక్ష్మి, గౌరిశంకర్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొండ వేణు మూర్తి, ప్రకాశ్ హొల్లా, బద్రుద్దీన్ కిమాని, ముక్క శరత్ కృష్ణ, శివకాంత్, ఏలుగురి ప్రసాద్, గుడిసె రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.