calender_icon.png 2 July, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

5న జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల సర్వేలు జయప్రదం చేయండి

01-07-2025 07:51:10 PM

పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి..

చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, మందుల కొరత డాక్టర్ల కొరత తీర్చాలని పిహెచ్‌సి స్థాయిలో ఉన్న సమస్యలను వెలికి తీయడానికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఒకరోజు సమగ్ర సర్వేలు నిర్వహించనున్నట్లు, ఈ సర్వేలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఐద్వా జిల్లా కార్యదర్శి ప్రభావతి(Aidwa District Secretary Prabhavati) పిలుపునిచ్చారు. మంగళవారం రోజున మర్రిగూడ మండల కేంద్రం రాజుపేట తండాలో ఐద్వా ఆధ్వర్యంలో ఐద్వా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో సరియైన వసతులు కల్పించాలని, ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆమె అన్నారు.

డాక్టర్లు సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆమె అన్నారు. ఇటీవల కాలంలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ అధికమైందని ప్రభుత్వ వైద్యం నిర్లక్ష్యానికి గురికావడం వలన ప్రజలలో అపనమ్మకం ఏర్పడి ప్రైవేటు వైపు పరుగులు తీస్తున్నారని ఆమె అన్నారు. ఈ అపవాదు తొలగించడానికి ఐద్వా తరఫున కృషి చేయనున్నట్లు ఆమె అన్నారు.   ప్రజలకు చిత్తశుద్ధితో మెరుగైన వైద్యం అందించినట్లయితే అత్యధికంగా ప్రజలు ఉచిత వైద్యానికే వస్తారని ఆమె అన్నారు.  ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నూతన టెక్నాలజీతో పరికరాలు, ఎక్స్రేలు ల్యాబ్లు, రక్త పరీక్షలు విరివిగా చేయాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సమగ్ర సర్వేలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండలఐద్వా కార్యదర్శి దామెర లక్ష్మీ నాయకురాలు కొడదల కల్పన కేశ బోయిన యాదమ్మ భుజాలు సోనా లలిత వెంకమ్మ లక్ష్మీ మల్లమ్మ రాములమ్మ సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.