calender_icon.png 2 July, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలి

01-07-2025 07:54:24 PM

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య...

మణుగూరు (విజయక్రాంతి): దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా ప్రజా పోరాటాలకు సిద్ధంకావాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య(CPM State Committee Member Annavarapu Kanakaiah) ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సీపీఏం కార్యాలయం శ్రామిక భవన్ లో జరిగిన పార్టీ సభ్యుల రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. దేశంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా ధారాదత్తం చేస్తోందన్నారు.

బిజెపి తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటూ ప్రజల మధ్య చీలికలు తెస్తున్నారని, పేద మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిర్మాణంలో రాజకీయ జోక్యం నివారించి, లబ్ధిదారులకు ఇందులో చెల్లింపులు అవినీతి అక్రమంలో చోటులేకుండా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సత్ర పల్లి సాంబశివరావు, నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు కొడిశాల రాములు, దామల్ల వెంకన్న, పిట్టల నాగమణి, మడి నరసిం హారావు, బొల్లం రాజు, తదితరులు పాల్గొన్నారు.