calender_icon.png 2 July, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు కంది విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

01-07-2025 07:56:47 PM

టేకులపల్లి (విజయక్రాంతి): నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్(National Food Security Mission) కింద టేకులపల్లి మండలానికి కేటాయించిన కంది విధానాలను ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) కోయగూడెం గ్రామ రైతులకు మంగళవారం పంపిణీ చేశారు. మండలానికి 21 క్వింటాల్ కంది విత్తనాలు కేటాయించినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. కంది విత్తనాలు కోయగూడెం గ్రామ రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇంకా ఆఫీసులో విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, విత్తనాలను భూమిలో వేయడానికి మాత్రమే ఇచ్చినందున వాటిని రైతులు భూమిలో విత్తుకోవాలని తెలిపారు. కంది విత్తనాలు పురుగు మందుతో విత్తనశుద్ది చేసి వచ్చాయని కనుక తినడానికి వాడరాదని రైతులకు వ్యవసాయాదికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ లాల్ చాంద్, ఏఓ అన్నపూర్ణ, పలువురు కాంగ్రెస్ నాయకులూ పాల్గొన్నారు.