10-09-2025 01:08:43 AM
మంత్రి లక్ష్మణ్‌కు టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలల టైమ్ టేబుల్ మార్పునకు వారం రోజుల్లో ఉత్తర్వులు విడుదల చేస్తామని ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అడ్లూ రి లక్ష్మణ్ హామీ ఇచ్చినట్టు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఈమేరకు మంగళవారం మంత్రి నివాసంలో గురుకుల పాఠశాలల ప్రతినిధులతో మంత్రిని కలిసి సమస్యలు దృష్టికి తీసుకెళ్లారు.
ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న 437 మంది పండిట్, పీఈటీ పోస్టుఎలను అప్‌గ్రేడ్ చేయాలని, సీఆర్‌టీలకు కనీస వేతనం వర్తింపజేయాలని, పదోన్నతులు కల్పించాలని మంత్రిని కోరగా, ఆయన సానుకూ లంగా స్పందించినట్టు తెలిపారు.
త్వరలోనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి గురుకుల పాఠశాలల్లోని అన్ని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో బాధ్యులు దిలీప్ రెడ్డి, నర్సయ్య, ప్రభాకర్, భాస్కర్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.