20-07-2024 12:48:08 AM
హాజరుకానున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలనే ఏకైక డిమాండ్‌తో బీజేవైఎం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద శనివారం మహాధర్నా జరుగనుంది. ఈ మహాధర్నాకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ ధర్నాకు నిరుద్యోగులు హాజరుకావాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ కోరారు.