29-12-2025 12:09:47 AM
అనుభవాలు పంచుకున్న
మిసెస్ ఇండియా రన్నరప్
హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): మిసెస్ ఇండియా పోటీలో రన్నరప్ క్రౌన్‌ను సాధించి తెలంగాణకు జాతీయ స్థాయిలో గర్వకారణమైన హైదరాబాద్‌కు చెందిన ఫిట్నెస్, న్యూట్రిషన్ కన్స ల్టెంట్ సుదీప్తా దాస్ కొండాపూర్‌లోని కొ హోర్ట్ కోవర్కింగ్‌లో ఆదివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. మీడియాను ఉద్దేశించి మా ట్లాడిన సుదీప్తా.. కార్పొరేట్ ప్రొఫెషనల్గా పనిచేసిన దశ నుంచి జాతీయ బ్యూటీ పే జెంట్ టైటిల్ హోల్డర్గా మారిన తన ప్రయాణాన్ని వివరించారు. సి-సెక్షన్ అనంతర ప్రస వానంతర పునరుద్ధరణ, ఎండోమెట్రియోసిస్తో చేసిన పోరాటం వంటి వ్యక్తిగత, శారీ రక సవాళ్లను ఆమె స్పష్టంగా పంచుకున్నారు.
క్రమబద్ధమైన ఫిట్నెస్, అవగాహన తో కూడిన పోషణ, మానసిక బలం, జీవనశైలి మార్పులు తన శారీరకమానసిక స్వస్థ తకు ఎలా దోహదపడ్డాయో వివరించారు. బోర్డ్రూమ్ నుంచి బ్యూటీ పేజెంట్ వరకు నా ప్రయాణం ఎన్నో సవాళ్లతో నిండిపోయింది, అని సుదీప్తా తెలిపారు. ప్రసవానం తర పునరుద్ధరణ, ఎండోమెట్రియోసిస్ నా బలాన్ని తీవ్రమైన పరీక్షకు గురిచేశాయని, ఫిట్నెస్, వెల్నెస్ ఆధారంగా మారాయని చెప్పారు. ‘ఈ రోజు నేను కేవలం టైటిల్ హోల్డర్గా కాదు, స్వస్థత, సమతుల్యత, అంతర్గత బలాన్ని ఎంచుకున్న మహిళగా నిలిచా ను’ అని వివరించారు. కాగా డిసెంబర్ 21న జైపూర్లో జరిగిన మిసెస్ ఇండియా 2025 పోటీలో ఆరు నెలల కఠిన సాధన, ఐదు రో జుల జాతీయ స్థాయి పోటీ అనంతరం సుదీ ప్తా రన్నరప్ టైటిల్ను సాధించారు.
అదనంగా ఆమెకు మిసెస్ ఇండియా ఫిట్ అండ్ ఫ్యాబ్యులస్ క్వీన్ 2025 అవార్డు కూడా లభించింది. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ జంషెడ్పూర్ పూర్వ విద్యార్థినైన సుదీప్తా, దాదాపు దశాబ్దకాలం హ్యూమన్ రిసోర్సెస్ రంగంలో పని చేసిన అనంతరం ఫిట్నెస్, వెల్నెస్ రంగంలో కి ప్రవేశించారు. తన ప్రయాణంలో భర్త మి స్టర్ దేవి ప్రసాద్ దాస్, అపోలో హెల్త్ అండ్ లైఫ్స్టైల్ సీహెచ్‌ఆర్‌వోగా నిరంతరం ప్రోత్సా హం అందించారని తెలిపారు. అలాగే తన కుమార్తె శనాయా దాస్ ప్రేమ, ప్రేరణ తన కు భావోద్వేగ ఆధారంగా మారిందని చెప్పా రు. మిసెస్ ఇండియా అనేది మిసెస్ ఇం డియా పేజెంట్స్ అండ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ట్రేడ్మార్క్. ఇది మాజీ మి సెస్ ఇండియా ఇంటర్నేషనల్ శ్రీమతి దీపాలి ఫడ్నిస్ స్థాపించిన సంస్థ.