29-12-2025 12:00:00 AM
స్నేహిత హిల్స్ ఫేస్ 2లో విచ్చలవిడిగా బ్లాస్టింగ్ లు
విటమిన్ ‘యం‘ మత్తులో మైనింగ్ అధికారులు...
ఇంత జరుగుతున్న నార్సింగి పోలీసులు ఏమి చేస్తున్నట్టు?
పక్కనే ఉన్న మిలటరీ స్థలాల్లో బ్లాస్టింగ్ చేసిన రాళ్ల ను పారబోస్తున్న బిల్డర్లు ?
బండ్లగూడ జాగిర్ డిసెంబర్ 28 (విజయక్రాంతి) : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్నేహిత హిల్స్ ఫేస్ 2లో కొందరు బిల్డర్ లు విచ్చలవిడిగా బ్లాస్టింగ్‌లు చేసి గుట్టలను పిండి చేస్తున్నా రు. ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ పగలు రాత్రి అనే తేడా లేకుండా బ్లాస్టిం గ్‌లు చేపడుతున్నారు. . స్నేహిత హిల్స్ ఫేస్ 2 దాదాపు మొత్తం కూడా ఎత్తయిన ప్రాం తమే ఇందులో చాలా ప్రాంతం గుట్టలతో కలిసి ఉన్నది .ఎత్తున ప్రాంతంలో దాదాపు 10 నుండి 15 మీటర్ల లోతున ఉన్న రాళ్ళను బిల్డర్లు బ్లాస్టింగ్ చేసి తొలగించేస్తున్నారు.
ఇంత జరుగుతున్న అటు మైనింగ్ ఇటు పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని విమర్శలు వినిపిస్తు న్నాయి. అటు మైనింగ్ అధికారులు ఇటు పోలీసుల మౌనం వెనుక అర్థమేమిటో తెలియడం లేదు. మైనింగ్ అధికారులకు కొంద రు బిల్డర్లు విటమిన్ ‘యం‘ సమర్పించుకొని ఏదేచ్ఛగా అక్రమంగా బ్లాస్టింగ్‌లు చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్లా స్టింగ్ చేసిన రాళ్లను తీసుకెళ్లి పక్కనే ఆర్మీ రక్షిత స్థలంలో పోస్తున్నారు. విచ్చలవిడి గా కొనసాగుతున్న బ్లాస్టింగ్లతో ఎప్పుడు ఏ ప్ర మాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది..
అనుమతులు లేకుండా బ్లాస్టింగ్‌లు చేస్తే చర్యలు తీసుకుంటాం
స్నేహిత హిల్స్ ఫేస్ 2 లో కొనసాగుతున్న అక్రమ బ్లాస్టింగ్ ల పై నార్సింగి ఎస్ హెచ్ ఓ హరికృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని. సోమవారం స్నేహిత హిల్స్ ఫేస్ 2 కాలని నీ సందర్శించనున్నట్లు తెలిపారు. మిలటరీ స్థలాల్లో ఎవరైనా ఎంక్రోచ్ కు పాల్పడిన బ్లాస్టింగ్ చేసిన వ్యర్ధాలు వేసిన చర్యలు తప్పవన్నారు.
హరికృష్ణ రెడ్డి, ఎస్ హెచ్ ఓ నార్సింగి పీ.ఎస్