29-12-2025 12:00:00 AM
బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో ఆవిష్కరణలు తెచ్చారు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి
వనపర్తి, డిసెంబర్ 28 ( విజయక్రాంతి): ప్రపంచంలోనే 140 ఏళ్ల చరిత్ర కలిగి ఆవిర్భవించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీని అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా నూతన కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ 140 వ ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేశారు. కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ...బ్రిటిష్ సామ్రాజ్యంలో వారి అరాచకాలకు , హింసకాండల నుంచి ప్రజలకు విముక్తి కలిగించలన గొప్ప సంకల్పంతో 1885 డిసెంబర్ 28 రోజున కాంగ్రెస్ పార్టీని మహానుభావులు ఆవిర్భవించారని ఆయన గుర్తు చేశారు. పార్టీ ఆవిర్భవ సమయానికి 30 కోట్ల ప్రజలున్నప్పటికీ.. పూర్వం రోజుల్లో తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో దాపరించిన రోజుల్లో.. ఎన్నో సంస్కరణలు చేసి బలుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పని చేసిందని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ నందిమల్ల యాదయ్య, పిసిసి కమిటీ సభ్యులు డెలిగెట్ శంకర్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ధనలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ మీడియా కన్వీనర్ నందిమల్ల చంద్రమౌళి, వివిధ మండలాల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కష్టపడే వారికే భీ ఫారాలు..
గద్వాల, డిసెంబర్ 28 : రానున్న స్థానిక సంస్థ ల ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి భీ ఫారాలు ఇవ్వాలన్న తనను కలవాల్సిందే అని డీసిసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గద్వాలలోని కాంగ్రెస్ పార్డీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఎవరైతే గెలుస్తారని తాను నమ్ముతానో, ఎవరి పనితీరుపై తనకు నమ్మకం ఉంటుందో వారికే టిక్కెట్లు ఇస్తామని అన్నారు.
రాబోయే మున్సిపల్, ఎంపిటిసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ’బి-ఫారాలను’ తానే స్వయంగా పంపిణీ చేస్తానని రాజీవ్ రెడ్డి స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో మరియు ఫారాల పంపిణీలో పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే అంతిమమని, అభ్యర్థులు నేరుగా తన కార్యాలయానికి వచ్చి వీటిని తీసుకోవాలని ఆయన సూచించారు. కౌన్సిలర్ నుండి జడ్పీటీసీ వరకు ప్రతి స్థానం పార్టీకి ముఖ్యమేనని, అందరూ సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. బంగ్లాలో కూర్చుంటే టికెట్లు రావని, పార్టీ కోసం కలిసి పని చేసే వారికే భీ ఫారాలు అందేలా కృషి చేస్తానన్నారు.
ఒకవేళ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఢిల్లీ నుంచి గల్లీ దాక ఎక్కడైన ఫిర్యాదు చేసుకోవచ్చు అని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నడవాలంటే తన పద్ధతిలోనే నడవాలని చెప్పారు. ప్రతి కౌన్సిలర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీటు గెలవడం తనకు చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. భారతీయుల ఆత్మగౌరవం కోసమే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని, తాను తన విలువను అలాగే తన కార్యకర్తల విలువను ఎప్పుడూ తగ్గించుకోనని ఆయన అన్నారు.
తనపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని, తనను ఎఐసిసి నియమించిందని, తనపై ఏ చర్య తీసుకోవాలన్నా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే నిర్ణయం తీసుకోవాలని ఆయన తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రస్తుతం ఉన్నది అసలైన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా వేరే చోట వ్యక్తిగత పేర్లతో కాంగ్రెస్ కార్యాలయాలు నడిపితే వారికి షోకాజ్ నోటీసులు ఇస్తామని, అవసరమైతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ కార్యక్రమాలకు రావడానికి ప్రత్యేక ఆహ్వానాలు అవసరం లేదని మీడియా లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందితే దాన్నే ఆహ్వానంగా భావించి రావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జీ వెంకటేష్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, రమేష్ నాయుడు, నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
పార్టీ జెండా ఆవిష్కరణ
గోపాలపేట, డిసెంబర్28 : మేజర్ తాడిపర్తి గ్రామపంచాయతీ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ ఘనంగా జరిపించారు. ఆదివారం వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. తాడిపర్తి గ్రామంలో ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సత్య శిలా రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు.
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చెంది నేటికీ 141 ఏళ్ళు అయ్యిందని కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని తెలిపారు. పార్టీ జెండాను ఎగురవేసి మిఠాయి పంపిణీ చేశారు తాడిపత్రి గ్రామంలో సర్పంచ్ లోకా రెడ్డి ఉపసర్పంచి వార్డు సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా వేడుకలు
మహబూబ్ నగర్, డిసెంబర్ 28(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరణ, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానుల సమక్షంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పురవీధులలోని ప్రధాన రోడ్ల మీదుగా పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి అశోక్ టాకీస్ చౌరస్తాలోని గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీ మరియు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
తదనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వలసలను అరికట్టి, పేదరికం తగ్గించి, పేదలకు స్థానికంగానే ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో యూపీఏ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ , సోనియా గాంధీ నాయకత్వంలో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు, కానీ బీజేపీ ప్రభుత్వం ఈ పథకం పేరులో నుంచి ‘మహాత్మా గాంధీ’ పేరును తొలగించి, చరిత్రను చెరిపివేయాలని చూస్తోందని మండిపడ్డారు.
గతంలో కేంద్రమే పూర్తి భారాన్ని మోసేదని, ఇప్పుడు 60:40 నిష్పత్తితో రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతున్నారని, పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పాటుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. ఒబెదుల్లా కొత్వాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్‌లో
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 28(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ వేడుకలను నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి పార్టీ జెండాని ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తోందన్నారు.
చారకొండ మండల కేంద్రంలో... కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గణేష్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గోరేటి శివ, అంజయ్య, జగన్ మోహన్, నర్సింహ్మ చారి, చారకొండ విజయ్, మల్లేష్, జంగులు, రామకృష్ణ, గణేష్, సత్తార్, పిల్లి శ్రీరాములు, నందిని, పసుల వెంకటరెడ్డి, కంత్రి, శ్రీనివాస్, కందికంటి శ్యామ్, సాయి కృష్ణ, తిరుమలేష్, లక్ష్మణ్, రాజు పాల్గొన్నారు.
కల్వకుర్తిలో.. ఇందిరా నగర్ కమాన్ వద్ద ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నాయకులతో కలిసి పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం మున్సిపాలిటీలో 4కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నాయకులు, బాలాజీ సింగ్, ఆనంద్ కుమార్, సుదర్శన్ రెడ్డి రమాకాంత్, భూపతి రెడ్డి, శాన్వాజ్ ఖాన్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వెల్దండ మండల కేంద్రంలో.. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు.
కొల్లాపూర్ మండల కేంద్రంలో.. ఎన్టీఆర్ చౌరస్తాలో బచ్చలకూర బాల్రాజ్, పెంట్లవెల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో కొండూరు సర్పంచ్ కేతూరి ధర్మతేజ, కుడికిల సర్పంచ్ రఘుపతిరావు, ఎన్నంబెట్ల మాజీ సర్పంచ్ నాగరాజ్, వంగ రాజశేఖర్ గౌడ్, కిరణ్ తేజ, పసుపు నరసింహ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామన్ గౌడు, పెంట్లవెల్లి మాజీ సర్పంచ్ కోట్ల సురేందర్ పాల్గొన్నారు.