24-10-2025 12:04:29 AM
నార్సింగి/చేగుంట, అక్టోబర్ 23 : పోలీసుల అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా ఏటా నిర్వహించే పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా నార్సింగి మండలంలో స్థానిక ఎస్‌ఐ బీమరి సృజన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని శేరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ఎస్‌ఐ సృజన, సిబ్బంది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
పాఠశాలలోని 6 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు మత్తు పదార్థాల నివారణపై వ్యాస రచన పోటీలతో పాటు కబడ్డీ, రన్నింగ్, వాలీ బాల్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు. పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ మిస్బాఉద్దీన్, పాఠశాల ఉపాధ్యాయులు జగన్నాథం, యాదగిరి, లింగం, రాజు, కన్వర్ కుమార్, వేణుగోపాల్, హెడ్ కానిస్టేబుల్, స్టేషన్ సిబ్బందిపాల్గొన్నారు.