13-05-2025 01:09:20 AM
జగిత్యాల అర్బన్, మే 12(విజయక్రాంతి): ప్రపంచ నర్సెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ అధికారులు, టిఎన్‌ఓఏ ప్రతినిధులు జిల్లా ప్రభుత్వ జనరల్ దావఖానాలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలోని 30 మంది నర్సింగ్ అధికారులు రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ విభాగంలో చేసిన సేవలను గుర్తించుకొని కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు.
ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సుగా చేసిన సేవలకు గుర్తింపుగా తన పుట్టిన రోజున ప్రపంచ నర్సెస్ దినోత్సవం గా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ కళావతి, డిప్యూటీ నర్సింగ్ సూపరిండెంట్ హేమలత, విజయమ్మ, ఫ్లోరెన్స్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ అనిత, కమల, టిఎన్‌ఓఏ రాష్ట్ర అధ్యక్షుడు రవి కిరణ్, జిల్లా అధ్యక్షురాలు సుభాషిని, సుజన్ కుమార్, దామోదర్, రాజేందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.