calender_icon.png 24 November, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దెబ్బ మీద దెబ్బ!

20-11-2025 12:00:00 AM

మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వచ్చే మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల ఉద్యమాన్ని నిర్వీర్యం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ఆచరణ రూపంలో కనిపిస్తున్నాయి. మంగళవారం అల్లూరి  జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు అగ్ర నాయకుడు మడావి హిడ్మా ఎన్ కౌంటర్‌ను బట్టి చూస్తే అమిత్ షా విధించిన గడువులోగానే భద్రతా దళా లు ఉద్యమాన్ని పరిసమాప్తం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.

హిడ్మా హతమవ్వడం మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ. ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతాదళా లు అడుగుడుగునా జల్లెడ పట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి జరిగిన ఎ న్‌కౌంటర్లలో మావోయిస్టు అగ్ర నాయకుడు నంబాల కేశవరావు సహా పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడుల నుంచి తృటిలో తప్పించుకున్న హిడ్మా ఒడిశాలోని సేఫ్‌జోన్‌లోకి వేళ్లే ప్రయత్నంలో మారేడుమిల్లి అడవుల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

సమాచా రం అందుకున్న భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేయడంతో మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మా, ఆ యన సతీమణి రాజే సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు. హి డ్మా చిన్న వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరాడు. భద్రతా దళాలపై జరిగిన అనేక దాడుల్లో హిడ్మాదే కీలకపాత్ర. హిడ్మాను లొంగిపోవా లని పలుమార్లు భద్రతా దళాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

అయితే హిడ్మా ఎన్‌కౌంటర్‌కు ముందు బస్తర్ ఐజీ.. అతడి తల్లిని కలిసి కుమారుడికి నచ్చజెప్పి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. అయితే ఎన్నిసార్లు బతిమాలినా తన మాట వినేవాడు కాదని హిడ్మా తల్లి పోలీసులతో పేర్కొంది. మావోయిస్టు ఉద్యమంలోనే తాను నేలకొరుగుతానని, భద్రతా దళాల ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదని హిడ్మా గతంలో చాలాసార్లు ప్రకటించాడు.

ఆపరేషన్ కగార్‌తో దండకారణ్యంలో భద్రతా దళాల కూంబింగ్, విస్తృత దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్టులు జనావాసా ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవా రం ఏకకాలంలో దాడులు నిర్వహించి 51 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అయితే మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ స్థలంలో దొరి కిన డైరీ ఆధారంగా పోలీసులు విజయవాడ ఆటోనగర్ సహా రామవరప్పాడు, ఏలూరు తదితర ప్రాంతాల్లో మావోయిస్టులను అరెస్టు చేశారు.

దేశంలో మావోయిస్టుల ఉద్యమాన్ని అణిచేవరకు ఆపరేషన్ కగార్ కొనసాగుతుందని భద్రతా దళాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మారేడుమిల్లి అడవుల్లో మరోసారి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మా వోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు ఉద్యమంలో చీలికలు తేవడానికి ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేసింది.

మావోయిస్టులు త మకు తాముగా వచ్చి లొంగిపోతే రివార్డులతో పాటు జనజీవన స్రవంతిలో గౌ రవంగా బతికేందుకు అవకాశమిస్తామని పేర్కొనడంతో.. అనారోగ్య కారణాలతో కొందరు, స్వేచ్ఛగా బతకాలనే ఆకాంక్షతో మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ జాబితాలో మల్లోజు వేణుగోపాల్, ఆశన్న సహా చాలా మంది ఉన్నారు. వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్ల కారణం గా మావోయిస్టుల ఉద్యమం చాలా వరకు బలహీనపడినట్లే!