20-11-2025 12:00:00 AM
ముచ్చుకోట సురేష్ బాబు :
* ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి సంబంధించి వాటి ఆస్తులకు విలువను ఎలా నిర్ణయించారు? రిజర్వ్ ప్రైస్‌ను ఎలా లెక్కించా రు? బిడ్డర్ల ను ఎలా ఎంచుకున్నారు? వంటి ప్రశ్నలకు ప్రభుత్వం సమా ధానమివ్వకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది.
దేశాభివృద్ధికి పునాది వేసిన ప్రభుత్వ రంగ సంస్థలు నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సంక్రమణ దశలో ఉంది. అయితే ఈ పరిస్థితి యాదృశ్చికం కాదు.. గత దశాబ్దంలో అమలైన కొన్ని తొందరపాటు నిర్ణయాలు, ఆలోచనలేని సంస్కరణలు, జాతీయ ఆస్తుల పరిరక్షణ లో ప్రభుత్వ వైఫల్యం, ప్రైవేటీకరణ అమ లు దీనికి కారణాలుగా చెప్పొచ్చు. దశాబ్దపు ఆర్థిక పొరపాట్లను ఒకసారి పరిశీ లించి చూసుకోవాల్సిన అవసరముంది.
2016 నవంబర్ 8న రాత్రి కేంద్ర ప్రభు త్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం భార త ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసిందని పేర్కొనవచ్చు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హెచ్చరించినట్టుగా నోట్ల రద్దుతో జీడీపీలో 2 శాతం పడిపోవడమే కాదు, దేశ అనధికారిక రంగం కూడా ఈ దెబ్బకు పూర్తిగా కుదేలయ్యింది. దేశంలోని లక్షలాది చిన్న, మధ్య తరహా వ్యాపారాలు మూతబడ్డా యి. ఆ దెబ్బ నుంచి కోలుకునేలోపే, ప్రభు త్వం తయారీ సరిగా లేని జీఎస్టీని అమలు చేసింది.
శ్లాబు రేటు పన్నుల విధానం, క్లిష్టమైన రిటర్నులు.. చిన్న వ్యాపారులకు భా రంగా మారిపోయాయి. ఈ రెండు నిర్ణయాలు కలిసి ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలిక మాంద్యంలోకి నెట్టాయడంలో సందేహం లేదు. ప్రజలకు భారంగా మారిన పన్నులు కార్పొరేట్లకు ఊహించని రీతిలో పెద్ద ్దలాభాలను తెచ్చిపెట్టాయి.
జాతీయాస్తుల అమ్మకం!
ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గిన సందర్భంలో, సాధారణంగా ప్రభుత్వాలు ప్రజలకు ఆ ప్రయోజనాలను అం దిస్తాయి. కానీ ఇక్కడ ధరలు తగ్గినా, పన్ను లు మాత్రం పెరగడం ఆశ్యర్యంగా అనిపిస్తుంది. పన్నులు పెరగడంతో పాటు కు టుంబ ఖర్చులు కూడా అమాంతం పెరిగా యి. అదే సమయానికి, 2019లో ప్రభు త్వం కార్పొరేట్లకు భారీ పన్ను రాయితీ ఇ చ్చింది. దేశ ఖజానాకు రూ. 1.45 లక్షల కోట్ల నష్టం జరిగినా, పెట్టుబడులు పెరగకపోవడం గమనార్హం.
ప్రజా రంగ సంస్థ లు ఒక ‘ఫైర్ సేల్’ లాంటివి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థల విషయం లో ప్రభుత్వం ప్రైవేటీకరణ మార్గాన్ని ఏం చుకోవడమనేది ఆలోచించాల్సిన అంశం. ఇది సంప్రదాయ ‘డిస్ ఇన్వెస్ట్‌మెంట్’ కా దు. ఒక రకంగా జాతీయ ఆస్తుల అమ్మకమని చెప్పొచ్చు. అయితే ప్రైవేటీకరణ వల్ల సామర్థ్యం పెరుగుతుందని, సంక్షేమ పథకాలకు నిధుల లభిస్తాయనేది ప్రభుత్వ వాదన.
కానీ నిజానికి ఇక్కడ జరుగుతున్నదేమిటంటే లాభాలు ప్రైవేట్ రంగానికి, నష్టా లు ప్రజాల భుజాల చెంత చేరుతున్నాయి. ప్రైవేటీకరణ విషయంలో అవమానకర పాఠాలు, అనుభవాలు ఎదురైనా ప్రభుత్వ తీరు మాత్రం మారలేదు. 2019 మ ధ్య ఎన్డీయే ప్రభుత్వ కాలంలో విఎస్‌ఎన్‌ఎల్ (విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్)కు సంబంధించిన విక్రయం తక్కువ విలువకే జరగడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.
నేడు ఎల్‌ఐసీ, ఐడీబీఐ, ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్ వంటి లావాదేవీలు కూడా నిజమైన డిస్ ఇన్వెస్ట్‌మెంట్‌లు కా వు. వాటిని ప్రభుత్వమే ప్రైవేటీకరణ పేరు తో ఒక జేబులో నుంచి మరో జేబులోకి మార్చుతూ వస్తుంది. దీర్ఘకాల ప్రమాదాల గురించి ప్రభుత్వం వద్ద ఇప్పటికైతే సమాధానం లేదు.
బ్యాంకింగ్‌పై ప్రభావం..
ప్రభుత్వ బ్యాంకులు 2008 గ్లోబల్ సంక్షోభాన్ని భారత్‌ను ఎలా రక్షించాయో దేశం ఇప్పటికీ మరిచిపోలేదు. అయితే ఇప్పుడు ఇవే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. ఎల్‌ఐసీ అనేది మౌలిక వసతుల అభివృద్ధికి ప్రధాన ఆర్థిక ఆధారం. దీనిని ప్రైవేటు హస్తాలకు అం దించడమంటే దీర్ఘకాల పెట్టుబడుల భవిష్యత్తును ప్రమాదంలో పెట్టినట్లే. ఇది సా మాజిక న్యాయాన్ని పూర్తిగ తుడిచిపెట్టిన ట్లే అవుతుంది.
దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు ఉన్న రిజర్వేషన్లు, ప్రభుత్వ వాటా 50 శాతం కంటే తక్కువగా ఉంటే రద్దవుతాయి. దీనివల్ల ప్రాంతీయ అభివృ ద్ధి కుంటుపడుతుంది. లాభాలు రాకపోతే గ్రామీణ బ్యాంకు శాఖలను ప్రైవేటు సంస్థలు కొనసాగిస్తాయా అన్నది అనుమానంగా మారింది. ఇప్పటికే నిరుద్యోగం అత్యధిక స్థాయిలో ఉండగా, ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చే యడం ద్వారా ప్రజా రంగ ఉద్యోగాలకు ముప్పు వచ్చే అవకాశముంది. దీని ప్రభావం కూడా మాములుగా ఉండదు.
తొందరపాటు నిర్ణయాలు..
ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ వివా దం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే సందర్భంలో వాటికి సంబంధించిన ఆస్తులకు విలువను ఎలా నిర్ణయించారు? రిజర్వ్ బేస్‌ప్రైస్‌ను ఎలా లెక్కించారు? బిడ్డర్లను ఎలా ఎంచుకున్నారు? లాంటి ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమివ్వకుండా ముం దుకు సాగుతుండటంపై సహజంగానే కలుగుతున్న అనుమానాలను మరింత పెంచుతోంది.
అయితే దీనికి నిదానమైన, సంస్థ నిర్ధిష్ట వ్యూహాలు అవసరం. అయితే అన్ని ప్రభుత్వరంగ సంస్థలు ఒకేలా ఉం డవు. ఇప్పటికీ కొన్ని సంస్థలు లాభాల్లోనే ఉన్నాయి. మరికొన్నింటిని పునర్‌వ్యవస్థీకరణ జరిపితే అవి లాభదాయకమవుతా యి. అందుకే ప్రతి సంస్థ తమ వ్యూహాలకు పదును పెట్టడం అవసరం. ప్రైవేటీకరణపై దీర్ఘకాలిక దృష్టి అవసరం. జాతీయ ఆస్తు లు కాపాడే బాధ్యత ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరం. ‘వాణిజ్యం చేయడం ప్రభు త్వం చేయాల్సిన పని కాదు’ అని ప్రభు త్వం చెప్పడం చూస్తుంటాం.
కానీ ఇక్కడ నిజం ఏమిటంటే, దేశ ఆర్థిక వ్యవస్థను సరిగ్గా నడపలేని ప్రభుత్వం, ఉద్యోగాలు సృష్టించలేని ప్రభుత్వం, సామాజిక న్యా యాన్ని కాపాడలేని ప్రభుత్వానికి జాతీయ ఆస్తులను అమ్మే హక్కు ఎంతమాత్రం లేదు. భారత ప్రజా రంగం దేశ స్వావలంబనకు, సామాజిక సమానతకు, మౌలిక అభివృద్ధికి పునాది. దానిని తొందరపాటు నిర్ణయాలతో అడ్డగోలుగా విక్రయించడం భవిష్యత్తు తరాల పట్ల ఘోర అన్యాయంగా అభివర్ణించొచ్చు.
వ్యాసకర్త సెల్: 9989988912