calender_icon.png 19 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోధన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు తాళం

19-09-2025 12:42:39 AM

-మూడు సంవత్సరాలుగా అద్దె ఇవ్వని ప్రభుత్వం

-తాళం వేసి నిరసన తెలిపిన భవన యజమానులు 

బోధన్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆ భవన యజమానులు గురువారం తాళం వేశారు. బోధన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతున్నది. అయితే గత 36 నెలలుగా అద్దె చెల్లించడం లేదని భవన యజమానులు పలుమార్లు పైఅధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా వారు స్పందించకపోవడంతో గురువారం భవనానికి తాళం వేశారు. కార్యాలయానికి తాళం వేయడంతో అధికారులు బయటే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సైతం బయటే ఉండిపోయారు.