calender_icon.png 19 August, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొర్రూరులో ఘనంగా బొడ్రాయి ప్రతిష్ఠాపన

19-08-2025 12:58:34 AM

తుర్కయంజాల్, ఆగస్టు 18:తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూ రులో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవంతో పా టు, రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ధ్వజస్తంభ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వ హించారు. వేడుకల్లో భాగంగా సింహ లగ్నములో యంత్ర ప్రతిష్ట, నాభిశిలా ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. వేదపండితులు ప్రత్యేకంగా సిద్ధం చేసిన బొడ్రాయికి మంత్రోచ్చారణల మధ్య వివిధ పూజలు నిర్వహించి, ఊరి నడిబొడ్డున ప్రతిష్ఠించారు. శాస్త్రోక్త విధానంలో జరిగిన ఈ ప్రతిష్ఠకు గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల కొంగుబంగారమైన రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఇలాంటి ఆధ్యాత్మిక, సాంప్రదాయ కార్యక్రమాలు ప్రజల ఐక్యతకు ప్రతీక అని అన్నారు. ఇవి ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించి, సాంప్రదాయ విలువలను కాపాడటానికి దోహదం చేస్తాయని తెలిపారు. బొడ్రాయి, ధ్వజస్తంభ ప్రతిష్ఠలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం రోజున జరిగే బోనాల ఉత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.