27-12-2025 01:36:58 AM
డమస్కస్, డిసెంబర్ ౨౬: సిరియాలోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో ౮ మంది మృతిచెందగా, 20 మం ది వరకు తీవ్రగాయాలపాలయ్యారు. హో మ్స్ నగరంలో ఈ ఘటనచోటు చేసుకు న్నది. జరిగింది. మైనారిటీ అలవైట్ వర్గం ఆ వాసంగా ఉన్న హోమ్స్ నగరంలోని ‘ఇమా మ్ అలీ బిన్ అబీ తాలిబ్’ అనేక మసీదులో ప్రార్థన చేసేందుకు శుక్రవారం వందలాది మంది తరలివచ్చారు. వారు నమాజ్ చేస్తుం డగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మసీదు గోడల ధ్వంస మయ్యాయి.
అక్కడికక్కడే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ౨౦ మంది తీవ్రగాయాల పాల య్యారు. క్షతగాత్రులను స్థానికులు స్థానిక ఆస్పత్రులకు తరలించి వైద్యం చేయి స్తున్నారు. దుండగులు పక్కా ప్లాన్‌తో పేలుడు పదార్థాలను మసీదులో అ మర్చా రని భద్రతా దళాలు ప్రాథమికంగా గుర్తిం చాయి. ఘటనపై సిరియా ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దేశంలో అశాం తిని సృష్టించేందుకే ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండి పడింది.