calender_icon.png 27 December, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్‌కు ఆపరేషన్ సిందూర్ 2.o భయం

27-12-2025 01:40:37 AM

ఎల్వోసీ వెంబడి డ్రోన్ల మోహరింపు

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: భారత సైన్యం మళ్లీ దాడులు చేస్తుందనే భయంతో పాకిస్థాన్ వణికిపోతోంది. ఈ ఏడాది మే నెలలో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బ కు పాక్ రక్షణ వ్యవస్థలు కకావికలమయ్యా యి. ఇప్పుడు మళ్లీ ‘ఆపరేషన్ సిందూర్ 2.o’ పేరుతో భారత్ విరుచుకుపడుతుందన్న స మాచారంతో పాక్ సైన్యం అప్రమత్తమైంది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో పాకిస్థాన్ యుద్ధ ప్రాతిపదికన రక్షణ ఏర్పాట్లు చేస్తోంది.

ముఖ్యంగా భారత డ్రోన్లను ఎదుర్కోవడానికి సరిహద్దుల్లోని రావాలాకోట్, కోట్లీ, భింబర్ సెక్టార్లలో కొత్తగా యాంటీ-డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. సుమారు 30కి పైగా ప్రత్యేక యాంటీ-డ్రోన్ యూనిట్లను పాక్ సైన్యం రంగంలోకి దించింది. డ్రోన్లను గుర్తించి కూల్చివేసేందుకు చైనా, టర్కీల నుంచి అధునాతన సాంకేతికతను పాక్ సేకరిస్తోంది.

ప్రస్తుతం భారత్ తన పశ్చిమ సరిహద్దుల్లో భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తుండటం పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. భారత నిఘా డ్రోన్లు నిరంతరం సరిహద్దులను పర్యవేక్షిస్తుండటంతో, ఎప్పుడైనా మరో మెరుపు దా డి జరగవచ్చని పాక్ సైనిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలోనే ఎల క్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలను పెంచుకుం టూ పాక్ తన సైన్యాన్ని సన్నద్ధం చేస్తోంది.