calender_icon.png 21 May, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరం చేస్తే జైలు జీవితం అనుభవించాల్సిందే

21-05-2025 01:21:38 AM

 ఎస్పీ  రాజేష్ చంద్ర

   కామారెడ్డి, మే 20 (విజయ క్రాంతి), మహిళను తలపై రాడ్ తో కొట్టిన వ్యక్తికి జీవిత ఖైదీ తో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ మంగళవారం తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. 

పది మే 2022 సంవత్సరంలో కామారెడ్డి జిల్లాఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పసిముద్దీన్ అలియాస్ టిల్లు అనే వ్యక్తి వసీమా బేగం తలపై ఇనుపరాడ్తో  బలంగా పలు మార్లు కొట్టి  హత్య చేశాడని ఆమె భర్త షేక్ కలీముల్లా  ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషనులో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసు పరిశోధనలో భాగంగా వసిముద్దీన్ అలియాస్ టిల్లు పిర్యాది ఇంటి గోడకు ఆనుకొని  రేకుల షెడ్ నిర్మించాడు. ఈ విషయంపై పిర్యాది భార్య వాసీమా బేగం పలు మార్లు నిందితుడుని షెడ్ను కొంత ప్రక్కకు వేసుకోవాలని కోరగా, నిందితుడు చాలా సార్లు ఆమెతో గొడవపడి, సమస్యను పెద్దమనుషుల సమక్షంలో చెప్పినా నిన్ను చంపుతాను అంటూ బెదిరించేవాడు.

చివరికి  10.05.2022  మున్సిపల్ అధికారులు వచ్చి ఆ రేకుల షెడ్ను తొలగించారు. ఇది మనసులో పెట్టుకొని వాసీమా బేగo  తన  ఇంటి ముందు అరుగుపై కూర్చుని ఉండగా ఐరన్ రాడ్ తో ఆమె తలపై బలంగా పలు మార్లు కొట్టి  హత్య చేసినాడు. ఇట్టి విషయములో సాక్షులను విచారించి, సరియగు సాక్షాలను సేకరించి నేరస్తుడిని అరెస్టు చేయడం తదుపరి కోర్టు యందు అభియోగ పత్రం వేయడం జరిగింది.

కేసులో సాక్షులను విచారించి, సాక్షాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం జరిగినదని  కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి CH.VRR వర ప్రసాద్  నిoదితునికి  జీవిత ఖైదు తో పాటు రూ. 2000  రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు  ఇచ్చినట్లు ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు. పోలీసు తరపున వాదనలు వినిపించిన పీపీ టి.రాజగోపాల్ గౌడ్, ఈ కేసును  సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి  ఎలారెడ్డి  సర్కిల్  ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, యస్‌ఐ  గణేష్ గారు,  ప్రస్తుత ఎలారెడ్డి  నుంచి సర్కిల్  ఇన్స్పెక్టర్లు రవీందర్ నాయక్, యస్‌ఐ  మహేష్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్త్స్ర రామేశ్వరు రెడ్డి, CౄO సాయిలు లను  జిల్లా ఎస్పీ అభినందించారు.