04-08-2025 12:00:00 AM
కాప్రా, ఆగస్ట్ 3 : ఈసీఐఎల్ కుషాయిగూడ పరిధిలోని కూరగాయల మార్కెట్ యార్డులో బోనాల పండుగను పురస్కరించుకొని ఆదివారం నిర్వహించిన వేడుకలు అత్యంత అద్భుతంగా నిర్వహించబడ్డాయి. సంప్రదాయ భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం స్థానిక ప్రజలతో పాటు మార్కెట్ యార్డు వ్యాపారుల హర్షాతిరేకాలకు కారణమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్‌ఎస్ ప్రభాకర్, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సం స్కృతి, సంప్రదాయాలకు నిలయంగా నిలిచే బోనాల పండుగను ఈ తరహాలో ప్రజలతో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం అని అన్నారు. కుషాయిగూడ కూర గాయల మార్కెట్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ నేతృత్వంలో కమిటీ సభ్యులు ఎంతో విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజారుల ఆరాధన, కళాత్మక ప్రదర్శనలు, భజనలు కార్యక్రమానికి మరిం త వైభవం చేకూర్చాయి. ప్రజలు పెద్ద ఎత్తు న హాజరై అమ్మవారిని దర్శించుకుని బోనా లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.