04-08-2025 12:00:00 AM
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
ముషీరాబాద్, ఆగస్టు 3(విజయక్రాంతి): ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సూచించారు. ఈ మేరకు రైట్ కేర్ క్లినిక్ బహుళ ప్రత్యేకతల వైద్య కేంద్రాన్ని నగరంలోని ఆఫీస్‌పేట్‌లో ఆదివారం ప్రారం భించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తొ కలిసి ఆయన మాట్లాడుతూ ప్రస్తుత బిజీ జీవితంలో ఆరోగ్యంగా ఉండ టం చాలా అవసరం అన్నారు.
ఆరోగ్యం కోసం ప్రజలు అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల ఆరోగ్యాభివృద్ధి కోసం రైట్ కేర్ క్లినిక్ లాంటి ఆరోగ్య కేంద్రా ల అవసరం ఉందన్నారు. అమెరికాలో ఉన్నా, ఇక్కడి వారి ఆరోగ్యం కోసం ఈ క్లినిక్ ప్రారంభించిన మనోహర్ ను అభినందించారు. ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అంది స్తూ క్లినిక్ అభివృద్ధి చెందాలన్నారు. కాలనీ వారందరికీ అందుబాటులో ఉంటూ ఆరో గ్య సేవలు అందిస్తూ ఈ క్లినిక్ మంచి పేరుతెచ్చుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ప్రజలకు మంచి వైద్య సేవ లు అందించే ఆశయంతో మొదలయిన రైట్ కేర్ క్లినిక్‌లో తాను కూడ సేవలు అం దించే భాగ్యం కలిగినందుకు ఆనందంగా ఉందని డాక్టర్ హేమలత, డాక్టర్ సంకీర్త్ అన్నారు. కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొని, ఆరోగ్య పరీక్షల ను స్వయంగా పరిశీలించి క్లినిక్ యాజమాన్యానికి, డాక్టర్లకు అభినందనలు తెలిపారు.
ఈ క్లినిక్లో పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఫిజియోథెరపీ సేవలు లభిస్తాయని క్లినిక్ ప్రతినిధులు తెలిపారు. త్వరలో న్యూరాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఈఎన్టీ, డయాబెటాలజీ తదితర విభాగాలను ప్రారంభించి సంపూర్ణ వైద్య సేవల కేంద్రం గా మారనుందన్నారు. వివరాల కోసం రైట్ కేర్ క్లినిక్ ఫోన్ నెంబర్ 91- 4035 789 789 నుసంప్రదించాలన్నారు.