04-08-2025 12:00:00 AM
ఖమ్మంలో యథేచ్ఛగా తిరుగుతున్న వాహనాలు
ఖమ్మం, ఆగస్ట్ 3 (విజయక్రాంతి): వింత శబ్దాలతో బుల్లెట్టులు....విచిత్రమైన నెంబర్ ప్లేట్లు....అసలు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు....హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల మా టే లేదు. ఇటువంటి వాహనాల కదలికలు ఖమ్మంలో సర్వసాధారణం అయిపోయింది. పై స్థాయి అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పు డు తనిఖీలు చేసి పట్టుకొని చలానాలు వేస్తున్నప్పటికీ వాహన చోదకుల్లో మార్పు మా త్రం లేదు.
ఖమ్మంలో పలువురు వారి బుల్లెట్లకు పెద్ద పెద్ద సౌండ్ లు వచ్చే సైలెన్సర్లను వినియోగిస్తున్నారు. కొన్ని బుల్లెట్ల సైలెన్సర్ల సౌండ్ టాప్ టాప్ అని బిగ్గరగా వస్తుంటుం ది. ఈ శబ్దాలతో పక్కన వాహనాల వారు, వాటిపై ప్రయాణించే చిన్న పిల్లలు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. ఇటీవల కాలం లో ట్రాఫిక్ పోలీసులు సైలెన్సర్లు తొలగించినప్పటికీ మళ్లీ షరా మామూలే అయింది.
కొందరు యువకులైతే ట్రాఫిక్ పోలీసుల ముందే అతి ఎక్కువ స్పీడుగా పెద్ద పెద్ద శబ్దా లు చేస్తూ వెళ్తుంటారు. చూసి చూడనట్టు ఉండటం తప్పించి, అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఏమీ చేయలేని పరిస్థితి. ఇదిలా ఉంటే కొన్ని టూవీలర్లకు అసలు నెంబర్ ప్లే ట్లే లేకుండా ఖమ్మంలో యదేచ్చగా తిరుగుతున్నారు. కొంతమంది వారి వాహనాలకు నెంబర్ ప్లేట్లు ఉన్న అక్కడ నెంబర్ ఉండదు.
వారు అభిమానించే నాయకుడి పేరో, వారి ఫేవరెట్ హీరో పేరో, వారి కులాల పేర్లో, ప్రె స్ అని కానీ, పోలీస్ అని కానీ పెట్టుకుంటున్నారు. ఈ వాహనాలు ఖమ్మం నగరంలోనే ప్రతిరోజు దర్శనమిస్తున్నాయి. ఈ నెం బర్ లు లేని వాహనాలు ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ చేసి వెళితే కనీసం నెంబర్ కూ డా నోట్ చేయటానికి వీలు లేని పరిస్థితి అ ని ఖమ్మం ప్రజలు అంటున్నారు.
చలానాలు విధించేటప్పుడు హడావిడి
వారి టార్గెట్లు పూర్తి చేసుకునే సమయం లో ట్రాఫిక్ పోలీసులు హడావిడి చేసి వాహనాలను పట్టుకొని చలానాలు విధిస్తున్నారు తప్పించి రెగ్యులర్గా వీటిపై దృష్టి పెట్టడం లేరని ఖమ్మంలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు గనక రోజు ఈ వాహనా ల మీద కూడా దృష్టి పెట్టినట్లయితే వాహన చోదకులు ఎందుకు ఈ విధంగా వాహనాలు నడుపుతారు అని ప్రజలు అడుగుతు న్నారు.
చలానాలపై పెట్టే దృష్టి ఇటువంటి వాటి మీద కూడా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఒకపక్క టూ వీలర్ పై వచ్చి చైన్ స్క్రాచింగులు తదితర సంఘ విద్రోహ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఇటువంటి వా హనాలు ఖమ్మంలో తిరుగుతుంటే పట్టించుకోవడం లేదు అని ప్రజల మండిపడుతున్నా రు . మూల మలుపుల్లో ఆపి పెండింగ్ చలానాలు కట్టించడం,
ఫైన్లు వేయడం చేసే ట్రా ఫిక్ వారు తలుచుకుంటే ఈ వాహనాలను కట్టడి చేయడం పెద్ద కష్టం కాదని ఖమ్మం ప్రజలు అంటున్నారు. రద్దీ ప్రదేశాల్లో పట్టపగలు ఆపి బ్రీత్ ఎనలైజర్ లతో టెస్ట్ చేసే ట్రాఫిక్ వారు ఇటువంటి నెంబర్ ప్లేట్ వాహనాలపై కూడా దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. 8 వాహనాల్లో 4 ఇటువంటివే ఖమ్మంలోని ఒక ప్రభుత్వ కార్యాలయం వద్ద శనివారం 8 ద్విచక్ర వాహనాలు ఆగి ఉన్నాయి. అందులో నాలుగు వాహనాలు ఇటువంటి వాహనాలే కావడం గమనార్హం.
200 ఇస్తే పోలే
కొందరిని, ఏంటి మీ బైకు కు నెంబర్ ప్లేట్ లేదు అని అడిగితే 200 ఇస్తే అయిపోయేదానికి నెంబర్ ప్లేట్ అవసరమా, నెంబర్ ప్లేట్ ఉన్నట్టయితే, సిగ్నల్ క్రాస్ చేసామని, హెల్మెట్ లేదని, రాంగ్ రూట్ లో వచ్చావని, ఓవర్ స్పీడ్ అని, సెల్ఫోన్ డ్రైవింగ్ అని ఫోటోలు తీసి పంపి చలానాలు కట్టమంటారు. అసలు నెంబర్ లేకపోతే ఇవేమీ ఉం డవుగా అని సమర్ధించుకుంటున్నారు,
మరి ఎవరైనా ఆపితే ఎలా అంటే, 200 ఇచ్చి వెళ్ళిపోతం, లేదా ఒకసారి ఫైన్ కడతాం అని సమాధానం చెబుతున్నారు.హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ముచ్చటే లేదు ప్రభుత్వం 2019 నుండి అన్ని కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఇస్తుంది. 2019 ఏప్రిల్ 1 ముందుకొన్న వా హనాలకు కూడా ఈ నెంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది. ఇది ఉన్నట్లయితే అంకెలు అన్నీ ఒకే ఫార్మేట్లో ఉండడంతో రాత్రి వేళల్లో కూడా గుర్తించటం సునాయాసం అవుతుంది.
ఒకే నెంబర్ పై రెండు వాహనాలు తిరగటానికి కూడా అవకాశం ఉండ దు. కానీ చాలా మంది ఈ నెంబర్ ప్లేట్లను వాడటం లేరు. వారికి ఇష్టం వచ్చిన నెంబర్ ప్లేట్లను ఇష్టం వచ్చిన ఫార్మేట్ లలో ఏర్పా టు చేస్తున్నారు. కొందరు అయితే అసలు నెంబర్, నెంబర్ ప్లేట్ కూడా లేకుండా చెక్క ర్లు కొడుతున్నారు. రోజు రోజుకి పెరుగుతు న్న ట్రాఫిక్ ను, జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ లు ఉండేలా, బిగ్గరగా సౌండ్లు చేసే బుల్లెట్ లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.