calender_icon.png 15 November, 2025 | 10:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారం కోసమే జననాడి

10-08-2024 04:40:57 AM

మంథని, ఆగస్టు 9: మంథని నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం జన నాడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ యువనేత దుద్దిళ్ల శ్రీనుబాబు తెలిపారు. ముత్తరం మండలంలోని రామకృష్ణపూర్, హరిపురం గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన జననాడి కార్యక్రమాల్లో శ్రీనుబాబు పాల్గొన్నారు. గ్రామ ప్రజల మధ్యలో కూర్చు ని, వారి నుంచి వినతులను స్వీకరించారు. అందులో సగానికిపైగా అక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.

మిగిలిన వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చా రు. ఇదిలా ఉండగా.. ముత్తారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ మాజీ మండలాధ్యక్షుడు బాల సాని మొగిలిగౌడ్ ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని శ్రీనుబాబు పరామర్శించారు. మొగిలి చిత్ర పటాని కి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం, మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఉన్నారు.