10-08-2024 04:39:30 AM
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 9(విజయక్రాంతి): వాగుపైన హైలెవల్ వంతెన నిర్మా ణం చేపట్టడంతో పాత రోడ్డు కనుమరుగయి ఆ ఊరికి ప్రయాణాలు నిలిచిపోయా యి. అత్యవసర సమయాల్లో సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన ఐత లచ్చవ్వ(65) అనారోగ్య సమస్యతో బాధపడుతుండటంతో స్థానికులు శుక్రవారం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. నిర్మాణంలోని వంతెన దాకా అంబులెన్స్ వచ్చి ఆగిపోయిం ది. ఇటీవల కురిసిన వర్షాలకు రాకపోకలు నిలిచిపోవడంతో 108 సిబ్బంది ఒడ్డున వాహనం నిలిపి వృద్ధురాలిని స్ట్రక్చర్‌లో తీసుకెళ్లారు. వేములవాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సాయంత్రం మృతి చెందింది. అసంపూర్తి బ్రిడ్జి పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.