08-03-2025 02:01:45 PM
హైదరాబాద్: వరంగల్ జిల్లా(Warangal District)లో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఎస్ఆర్ఎస్ పీ కాల్వ(SRSP Canal)లో కారు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బాలుడు మృతి చెందాడు. సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఆర్ఎస్ పీ కాల్వలో పడడంతో కారుతో సహా తండ్రి, కుమారై గల్లంతయ్యారు. ఎస్ఆర్ఎస్ పీ కాల్వలో కొట్టుకుపోతున్న తల్లిని స్థానికులు కాపాడారు. బాధితులను ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి(Mecharajpalle Village)కు చెందిన కుటుంబంగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని బాలుడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.