calender_icon.png 17 November, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఖిలపక్ష ఎంపీల సమావేశం.. మీటింగ్‌కు బీఆర్ఎస్, బీజేపీ దూరం

08-03-2025 01:34:43 PM

హైదరాబాద్: ప్రజాభవన్ లో తెలంగాణ ఎంపీల సమావేశం(Telangana MPs meeting) కొనసాగుతోంది. సమావేశానికి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. కేంద్రం వద్ద పెండింగులో ఉన్న అంశాలపై ఎంపీల సమావేశం జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఎంపీల సమావేశం కొనసాగుతోంది. ఎంపీల సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ హాజరుకాలేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే లేఖ రాశారు. ఎంపీల సమావేశంపై లేఖ పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీల మీటింగ్ కు బీజేపీ నుంచి హాజరుకాలేకపోతున్నామన్నారు. మీ లేఖ ఆలస్యంగా అందడంతో పార్టీలో చర్చించుకునే సమయం లేదన్న కిషన్ రెడ్డి ఇప్పటికే తమకు ఎన్నో అధికారిక కార్యక్రమాలు ఖరారయ్యాయని తెలిపారు. భవిష్యత్ లో సమావేశం నిర్వహించాలనుకుంటే కాస్త ముందుగా తెలియజేయగలరు అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.