calender_icon.png 17 November, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెస్య్కూ బృందాలకు కూడా అది రిస్కీ జోన్: మంత్రి ఉత్తమ్

08-03-2025 02:25:12 PM

హైదరాబాద్: నాగర్ కర్నూల్ ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోయిన ప్రదేశంలో శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) సహాయక చర్యలను సమీక్షించారు. అక్కడ తప్పిపోయిన వారిని కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మీడియాతో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... 14 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉందని మంత్రి తెలిపారు. చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్(SLBC tunnel rescue operation) చేసే వాళ్లకూ ప్రమాదమేనని ఉత్తమ్ తెలిపారు. అందుకే రోబోల సాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నామని మంత్రి వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ లో 525 మంది సిబ్బంది పాల్గొన్నారని మంత్రి వివరించారు. కేరళ జాగిలాలతో అన్వేషిస్తే ఒకే చోటు ముగ్గురు ఉన్నట్లు గుర్తించామని ఆయన సూచించారు. ఆచూకీ తెలియకుండా పోయిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.