01-07-2025 10:38:15 PM
కోదాడ: నీటి సంపులో పడి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కోదాడ మండల(Kodad Mandal) పరిధిలోని గుడిబండ గ్రామానికి చెందిన శ్రీపాదిగోపి, నాగేశ్వరి దంపతులకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి 20 నెలల బాలుడు మహదేవ్ (లక్కీ) ఉన్నాడు. అయితే తండ్రి కార్పెంటర్ వృత్తినిత్య మిర్యాలగూడెం వెళ్లాడు. తల్లి నాగేశ్వరి వద్ద నిద్రిస్తున్న మహదేవ్ నిద్రలేచి ఆడుకుంటూ ఇంటి వెనకాల ఉన్న సంపు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు.
నాగేశ్వరి లేచి చూసేసరికి దగ్గర బాలుడు లేకపోవడంతో కంగారు పడింది. దీంతో బాలుడిని వెతుకుతున్న క్రమంలో ఇంటి వెనకాల సంపులో పడి ఉన్నాడు. తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని బాలుని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారణ చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహించారు. బాలుడు తండ్రి గోపి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.