calender_icon.png 2 July, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐఎస్ఎఫ్ జిల్లా నాలుగవ మహాసభను విజయవంతం చేయండి..

01-07-2025 10:41:46 PM

ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మగాని హరీష్..

ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): ఇల్లందులోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మగాని హరీష్(District Working President Ummagani Harish) పాల్గొని మాట్లాడారు. దేశ స్వతంత్రం కోసం అనంతరం విద్యారంగ సమస్యల కోసం నూతన శాస్త్రీయ విద్య విధానం కోసం, చదువుకై పోరాడు చదువుతూ పోరాడు అని నినాదంతో అలుపెరుగని పోరాటాలు చేస్తూ, జూలై మూడున పాల్వంచ సిపిఐ కార్యాలయం చండ్ర రాజేశ్వరరావు భవన్ నందు నిర్వహించుకుంటున్న అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాలుగో మహాసభను జయప్రదం చేయాలని, ఇల్లందు నియోజకవర్గం నుండి విద్యార్థులు స్వచ్ఛందంగా తరలిరావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి ఎన్ సాయి, ఏ ఐ వై ఎఫ్ మండల కార్యదర్శి ఈర్ల రవి, శివ, గణేష్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.