12-05-2025 12:03:57 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్ , మే 11(విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదంలో ఆసిఫా బాద్ మండలంలోని అడ గ్రామం పోస్ట్ ఆఫీస్ బీపీఎం మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలోని బూరుగూడ సమీపం లోని హీన జీన్నింగ్ మిల్లు వద్ద చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన అబ్దుల్లా బిన్ సాలే (42) ఆదివారం పని నిమిత్తం ఆసిఫాబాద్ నుండి కాగజ్ నగర్ వెళ్తున్నాడు .
హిన జిన్నింగ్ సమీపంలోని మూల మలుపు వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది.దీంతో కారులో ఉన్న అబ్దుల్లా బిన్ సాలె కాలు రెండు ముక్కలు కాగా ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సంఘటనకు చేరుకున్న స్థానికులు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన అబ్దుల్లా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మృతుడు ఆసిఫాబాద్ మండలం ఆడ గ్రామం లో పోస్ట్ ఆఫీస్ బీపీఎం గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడికి ఒక బాబు, భార్య ఆస్మ బెగం ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.