12-05-2025 12:06:28 AM
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, మే 11 (విజయక్రాంతి) : ఉగ్రవాదాన్ని తుది ముట్టించేందుకు భారత జవాన్ లు చేపడుతున్న పోరాటం మరువలేనిదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. పహాల్గమ్ లో జరిగిన ఉగ్ర దాడిలో చనిపోయిన వారి ఆత్మ శాంతి తో పాటు భారత్- పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ ల స్మారకార్థం వారి త్యాగాలను స్మరించుకుంటూ ఆదివారం బి.ఆర్.పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలోని కార్గిల్ పార్కులో గల అమర వీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులను వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ మేరకు జోగు రామన్న మాట్లాడుతూ ప్రతి భారత జవాన్ ల సేవలు వెలకట్టలేనిదని కొనియాడారు. ఆర్మీ జవన్ ను కోల్పోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని.. భారత ఆర్మీ జవాన్లకు ఎల్లవేళలా పార్టీలకు అతీతంగా అండగా ఉండడం జరుగుతుంది అన్నారు.
జవాన్ల ధైర్య సాహసాలతో వెనుదిరిగిన పాకిస్తాన్ తలవంచు కొని పారిపోయిందన్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు శంకర్ దాస్, మజారుద్దీన్, వామన్ రెడ్డి, రమేష్ ముండే, వినోద్, తోపాటు నాయకులు అజయ్, మెట్టు ప్రహ్లాద్, యూనిస్ అక్బనీ, సాజిత్ దోద్దీన్, కస్తాల ప్రేమల, చందాల రాజన్న, దాసరి రమేష్, సలీం పాషా, కొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు.