12-05-2025 12:03:48 AM
చేగుంట, మే 11: మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మొగుళ్ళ భద్రయ్య అధ్యక్షతన మెదక్ జిల్లా అధ్యక్షులు సాయి యాదవ్ ఆధ్వర్యంలో కొత్తగా జిల్లా కార్యవర్గంను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కార్యవర్గంలో చేగుంట మండల అధ్యక్షులుగా పి.ఈశ్వర్, వడియారం గ్రామానికి చెందిన మహమ్మద్ నదీమ్ హాసన్ ను జిల్లా జాయింట్ సెక్రెటరీగా, చింతాకుల లింగంపే కార్యవర్గ సభ్యులుగా, రాజ్ పురోహిత్ రామసింగ్ ని మెదక్ జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆర్గనైజేషన్ సెక్రటరీగా నియమించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సామాన్యుల సమస్యలపై పోరాటం చేసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలిపారు.