calender_icon.png 27 August, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒగ్గు కళాకారుల నేపథ్యంలో బ్రహ్మాండ

27-08-2025 01:57:02 AM

ఒగ్గుకథా కళాకారుల నేపథ్యంలో రూపొందించిన సినిమా ‘బ్రహ్మాండ’. రాంబాబు కథాస్క్రీన్‌ప్లే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దాసరి సురేశ్ నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటించారు. బలగం జయరాం, కొమరక్క, బన్నీ రాజు, కనీకావాధ్వ, ఛత్రపతి శేఖర్, అమిత్, దిల్ రమేశ్, ప్రసన్నకుమార్, దేవిశ్రీ, కర్తానందం ఇతర పాత్రలు పోషించారు.

వరికుప్పల యాదగిరి సం గీత సారథ్యం వహించిన ఈ చిత్రానికి కాసుల కార్తీక్ డీవోపీగా, ఎమ్మార్ వర్మ ఎడిటర్‌గా పనిచేశారు. ఈ సినిమా ఆగస్టు 29 విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెం ట్ నిర్వహించారు. ఈ వేడుకలో ఆమని మాట్లాడుతూ.. “బ్రహ్మాండ’ తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి ఇస్తుంది” అని తెలిపారు.

‘ఈ సినిమాలో నాది అద్భుతమైన పాత్ర. సినిమా నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది. శుక్రవారం రిలీజ్ చేయబోతున్నాం. అందరూ ఆదరించండి. ముఖ్యంగా క్లుమైక్స్‌ను మిస్ చేయకండి’ అని హీరో బన్నీ రాజు అన్నారు. నిర్మాత దాసరి సురేశ్ మాట్లాడుతూ.. “స్క్రిప్ట్ దశలో అనుకున్నది అనుకున్నట్టు.. అంతకుమించి చిత్రీకరించాం. మా డైరెక్టర్ ఇప్పుడు మా మధ్య లేకపోవడం బాధాకరం” అని చెప్పారు.