08-08-2025 12:42:20 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): తల్లిపాలు అమృతంతో సమానమని, ఇవి కేవలం బిడ్డ ఆకలి తీర్చడమే కాకుండా ఔషధంలా పనిచేస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో కళాభారతిలో తల్లిపాల ప్రయోజనాలపై ఏర్పాటుచేసిన తల్లులు, స్వయం సహాయక సభ్యుల అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు.
సాధారణ ప్రసవం అయినా, సిజేరియన్ చేసినా మొదటి గంటలోపు బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు పట్టించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమయం వృథా చేయకూడదని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తల్లిపాల ఆవశ్యకతను ప్రతి మహిళకూ వివరించాలని సూచించారు. గర్భిణీలు, శిశువులకు ప్రభుత ్వ ఆసుపత్రిల్లో మెరుగైన సేవలు అందుతున్నాయని తెలిపారు. అనంతరం చిన్నారు లకు అన్నప్రాసన నిర్వహించారు.
తల్లిపాల ఆవశ్యకతపై ప్రొఫెసర్ బీజు ఆధ్వర్యంలో చల్మెడ నర్సింగ్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నాటకం, నృత్య రూపకం ఆకట్టుకున్నాయి. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, మెప్మా పీడీ వేణుమాధవ్ , సిడిపిఓ సబిత, స్వయం సహాయక సంఘాల సభ్యులు, తల్లులు పాల్గొన్నారు.