22-08-2025 01:15:37 AM
అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 21:బిఆర్‌ఆర్ ఫౌండేషన్ సంకల్పం ఫలించడంతో ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి ఇబ్రహీంపట్నం చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి గురువారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బూడిద రాంరెడ్డి మాట్లాడుతూ.. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్ లను ని షేదిస్తూ పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.
గత 20 రోజులుగా బిఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్, డ్రగ్స్, మాదక ద్రవ్యాలను నిషేదించాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ పాఠశాలల నుంచి 950 మంది విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించమనీ, అదేవిధంగా డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్, మాదక ద్రవ్యలు, మత్తు పానియాలను అంతం చేయాలని, అవగాహన కల్పించ డం జరిగిందన్నారు.
కాగా బుధవారం ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్ లను నిషేదిస్తూ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన పార్లమెంట్ బిల్లుకు సపోర్ట్ గా ఓటు వేసి భవిష్యత్తు తరాల జీవితాలు నా శనం కాకుండా చట్టం తెచ్చి, యువత జీవితాలను కాపాడిన ప్రతి పార్లమెంట్ సభ్యునికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి, సురేందర్ రెడ్డి, గోపాల్, బోస్ పల్లి మోహన్, గొరిగే రమేష్, మంగ ఐలయ్య, బోడుసు వెంకటేష్, భగీ రథ, శేఖర్, కొండ్రు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.