calender_icon.png 31 January, 2026 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదు

31-01-2026 12:58:19 AM

ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి

ఆమనగల్లు, జనవరి 30 (విజయక్రాంతి): గత పదేళ్ల పాలనలో ప్రజలను విస్మరించిన బీఆర్‌ఎస్, బీజేపీలకు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆమనగల్లు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఉమ్మడిగా మాట్లాడారు.

ప్రజా ప్రభుత్వం.. సంక్షేమ పథకాలు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని వారు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ప్రజా పాలన సాగిస్తున్నామని చెప్పారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలు విజయవంతంగా కొనసాగుతుయన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా ఖాళీల భర్తీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థాపన, మహిళా సంఘాలకు రుణాల పంపిణీ వేగవంతం చేశాం అని గుర్తు చేశారు.

ఆమనగల్లు, కల్వకుర్తి అభివృద్ధికి ప్రత్యేక కృషి

మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎంపీ మల్లు రవి వెల్లడించారు. ఆమనగల్లును కేంద్రంగా చేసుకుని ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఆమనగల్లు రూపురేఖలను మార్చేలా అభివృద్ధి పనులు చేపడతామని, చిరు వ్యాపారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి చెందిన వారు కావడంతో, ఆమనగల్లు అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పని చేసే ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆశీర్వదిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందుకు తెస్తాం అని వారు హామీనిచ్చారు.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కేశవులు, జగన్, మానయ్య, శివలింగం, మహేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.